వైసీపీ ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం అర్ధరాత్రి కిడ్నాప్‌కు గురయ్యారు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక సందర్భంగా తిరుపతిలో విపరీతమైన దాడులు, ప్రజాప్రతినిధుల కిడ్నాప్‌లు కలకలం రేపుతున్నాయి. నిన్న నలుగురు కార్పొరేటర్ల కిడ్నాప్‌నకు గురవ్వగా, అర్ధరాత్రి ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం కిడ్నాప్ జరిగింది. అర్ధరాత్రి ఎమ్మెల్సీ నివాసంలోకి దూరి ఆయనను కిడ్నాప్ చేసినట్లు సమాచారం. డిప్యూటీ మేయర్ ఎన్నికలో ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఉన్న సుబ్రహ్మణ్యం ఓటు కీలకం కానుంది.
డిప్యూటీ మేయర్ పీఠం కోసం అధికార టీడీపీ, జనసేన నేతలు అరాచకం సృష్టిస్తున్నారని, బలం లేకపోయినా వైసీపీ సభ్యులను కిడ్నాప్ చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వైసీపీ మండిపడుతోంది. ఎమ్మెల్సీని కిడ్నాప్ చేయడంతో పాటు తిరుపతి వైసీపీ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి డ్రైవర్‌పై దాడి చేశారు. అదే విధంగా అభినయ్ బంధువు కౌశిక్, టౌన్ బ్యాంకు వైస్ చైర్మన్ వాసుదేవ యాదవ్‌లపై కూటమి నేతలు దాడికి పాల్పడ్డారు. అదే విధంగా రెండు కార్లను ధ్వంసం చేశారు.