ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, YCP అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు కర్నూలులో పర్యటించనున్నారు. బెంగళూరు నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో మధ్యాహ్నం 12 గంటలకు కర్నూలుకు చేరుకుంటారు. కర్నూలులో జీఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనున్న YCP నేత తెర్నెకల్ సురేందర్‌రెడ్డి కుమార్తె వివాహా రిసెప్షన్‌కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు.
పార్టీ నేతలతో భేటీ
వివాహ వేడుక అనంతరం, జగన్ కర్నూలులో పార్టీ జిల్లా నేతలతో సమావేశమవుతారని సమాచారం. ఈ భేటీలో స్థానిక రాజకీయాలపై చర్చలు జరగొచ్చని అంచనా. పార్టీ నేతలతో సమావేశం అనంతరం జగన్ కర్నూలు నుండి బయలుదేరి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.