---Advertisement---

అదుపుత‌ప్పి ప‌ల్టీ కొట్టిన డీసీఎం.. ప‌లువురికి గాయాలు

అదుపుత‌ప్పి ప‌ల్టీ కొట్టిన డీసీఎం.. ప‌లువురికి గాయాలు
---Advertisement---

ఘట్‌కేసర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. వరంగల్ హైవేపై యాదగిరిగుట్ట నుంచి తిరిగి వస్తుండగా, DCM వాహనం బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడగా, వెంటనే వారిని ఘట్‌కేసర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో వాహనంలో ఉప్పునూతల గ్రామానికి చెందిన 35 మంది ఉన్నట్లు సమాచారం. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మరిన్ని వివరాలను సేకరిస్తున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్ర‌మాదానికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment