మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో ముంబై ఇండియన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ హైడ్రామా నడుమ ముగిసింది. చివరి బంతికి రనౌట్‌పై వచ్చిన థర్డ్ అంపైర్ నిర్ణయం తీవ్ర చర్చకు దారి తీసింది. ఢిల్లీ జట్టుకు గెలవాలంటే చివరి బంతికి 2 పరుగులు అవసరం. క్రీజ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్ అరుంధతి కవర్స్ వైపు షాట్ ఆడడంతో, ఆమె రెండో పరుగుకు ప్రయత్నించారు. బ్యాట్ క్రీజ్‌లైన్‌ను చేరుకునే లోపే వికెట్ కీపర్ రనౌట్ చేసింది.
అయితే, థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించడంతో అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ వివాదాస్పద నిర్ణయం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ముంబై ఇండియన్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు చివరి బంతికి విజయం సాధించింది. ఇప్పుడిదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
నిబంధన ఏం చెబుతోంది..
నిబంధనల ప్రకారం.. మ్యాచ్‌లో ఎల్‌ఈడీ వికెట్లను ఉపయోగించినప్పుడు కొన్ని నిర్దిష్టమైన నిబంధనలున్నాయి. స్టంప్స్‌ను బాల్ తాకిన తర్వాత లైట్లు వెలిగినా.. బెయిల్స్ గాల్లోకి ఎగిరినప్పుడు మాత్రమే దానిని రనౌట్‌గా పరిగణించాలి. బాల్ తాకినా బెయిల్స్ పడకపోతే దానిని ఔట్‌గా నిర్ణయిస్తారు.