ఖతార్ రాజధాని దోహాలో ఆదివారం ముగిసిన 2025 ఫిడే వరల్డ్ ర్యాపిడ్ చెస్ (2025 FIDE World Rapid Chess) & మహిళల వరల్డ్ ర్యాపిడ్ చెస్ (Women’s World Rapid Chess) ఛాంపియన్‌షిప్‌ల్లో (Championships) భారత్(India)కు మంచి ఫలితాలు వచ్చాయి. పురుషుల విభాగంలో ఆర్జున్ ఎరిగైసి (Arjun Erigaisi), మహిళల విభాగంలో కోనేరు హంపీ (Koneru Humpy) కాంస్య పతకాలు సాధించి దేశానికి డబుల్ గౌరవం అందించారు. నార్వే చెస్ దిగ్గజం మాగ్నస్ కార్ల్సన్ 13 రౌండ్లలో 10.5 పాయింట్లతో ప్రపంచ ర్యాపిడ్ చెస్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఇది కార్ల్సన్‌కు ఆరవ వరల్డ్ ర్యాపిడ్ టైటిల్ కావడం విశేషం.
9.5 పాయింట్లతో వ్లాదిస్లావ్ ఆర్టెమీవ్, ఆర్జున్ ఎరిగైసి, హాన్స్ మోక్ నియమాన్, లైనియర్ డొమింగెజ్ పెరెజ్ సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. అయితే టైబ్రేక్ (TB1)లో ఆర్టెమీవ్ (105.5) రెండో స్థానంలో నిలవగా, ఎరిగైసి (98) మూడో స్థానంతో కాంస్య పతకం సాధించాడు. నాలుగో బోర్డుపై అలెగ్జాండర్ షిమానోవ్‌పై కీలక విజయం సాధించిన ఎరిగైసి 9.5 పాయింట్లకు చేరుకుని పతకం ఖరారు చేసుకున్నాడు.
భారత ఇతర ఆటగాళ్లలో అరవింద్ చితంబరం – 16వ స్థానం (8.5 పాయింట్లు), నిహాల్ సరీన్ – 19వ స్థానం (8.5), గుకేష్ దొమ్మరాజు – 20వ స్థానం (8.5), ప్రగ్యానానంద – 28వ స్థానం (8.5) సాధించారు.
హంపీకి మరో అంతర్జాతీయ గౌరవం
మహిళల వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో కోనేరు హంపీ అద్భుత ప్రదర్శన కనబరిచారు. 11 రౌండ్లలో 8.5 పాయింట్లతో రష్యాకు చెందిన అలెక్సాండ్రా గోరియాచ్కినా, చైనాకు చెందిన జూ జీనర్‌తో కలిసి హంపీ టాప్ స్థానంలో నిలిచారు. టైబ్రేక్‌లో జూ జీనర్ మొదటి స్థానం, గోరియాచ్కినా రెండో స్థానంలో నిలవగా, హంపీ మూడో స్థానం (కాంస్యం) సాధించారు. అనంతరం జరిగిన టైబ్రేక్ మ్యాచ్‌లో గోరియాచ్కినా విజయం సాధించి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. 38 ఏళ్ల హంపీకి ఇది మరో ఘనతగా నిలిచింది. ఇప్పటికే ఆమె 2019, 2024లో వరల్డ్ ర్యాపిడ్ చెస్ స్వర్ణ పతకాలు గెలుచుకున్నారు.
భారత మహిళా ఆటగాళ్లలో బి. సవితా శ్రీ – 8 పాయింట్లతో 4వ స్థానం, ఆర్. వైశాలి – 4వ స్థానం, టర్కీకి చెందిన ఎకటెరీనా అతాలిక్ కూడా 8 పాయింట్లతో సంయుక్తంగా నిలిచారు. ప్రపంచస్థాయి పోటీల్లో భారత చెస్ ఆటగాళ్లు స్థిరమైన ప్రదర్శనతో ముందుకుసాగుతున్నారని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. యువ ఆటగాడు ఎరిగైసి నుంచి అనుభవజ్ఞురాలు హంపీ వరకు అందరూ దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నారు.








