ఆస‌క్తిక‌ర‌ పోరులో 13వ గేమ్ ‘డ్రా’

ఆస‌క్తిక‌ర‌ పోరులో 13వ గేమ్ 'డ్రా'

2024 ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ మ‌రింత ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత ఛాంపియన్ డింగ్ లిరెన్ మరియు ఇండియన్ యువ చెస్ మేటి డి. గుకేష్ మధ్య టైటిల్ పోరు కొనసాగుతోంది. ఈనెల 9వ తేదీన జరిగిన 12వ రౌండ్ గేమ్‌లో గుకేష్ ఓటమి చెందడంతో మ్యాచ్ 6-6తో సమంగా ఉంది. 7.5 పాయింట్ల మార్క్‌ను చేరుకోవడం ద్వారా విజయాన్ని సాధించవచ్చు కాబట్టి నేడు సింగపూర్‌లోని రిసార్ట్స్ వరల్డ్ సెంటోసాలో వీరిద్ద‌రి మ‌ధ్య జరిగే 13వ రౌండ్ గేమ్ అత్యంత కీలకంగా మారింది.

14 రౌండ్‌ల గేమ్‌ సిరీస్‌లో మొదటి పది గేమ్‌లలో వరుసగా ఎనిమిది ‘డ్రా’ల తర్వాత భారత గ్రాండ్‌మాస్టర్ D. గుకేష్ 11 రౌండ్ గేమ్‌లో భారీ విజయాన్ని సాధించి మ్యాచ్‌లో 6-5 ఆధిక్యాన్ని సంపాదించాడు. అయితే డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్ 12వ గేమ్‌ను గెలిచి మరోసారి స్కోర్‌లను 6-6తో సమం చేసి టైటిల్ పోరులో ప‌ట్టు నిలుపుకున్నాడు. ఈ సిరీస్‌లోని రెండవ చివరి గేమ్‌లో వీరిద్ద‌రూ త‌ల‌ప‌డ్డారు. 13వ రౌండ్ గేమ్‌లో ఎలాగైన విజ‌యం సాధించాల‌ని బ‌రిలోకి దిగిన వీరు 5 గంటల పోరాటం తర్వాత గేమ్ డ్రాగా ముగించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment