డిసెంబర్ 21న మనం ప్రత్యేకమైన ఓ వింత అనుభూతిని పొందుతామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూభ్రమణంలో భాగంగా, సూర్యుడి చుట్టూ భూమి తిరిగే కక్ష్య మార్పు కారణంగా 21వ తేదీన 16 గంటల సుదీర్ఘ రాత్రి మరియు కేవలం 8 గంటలే సూర్యకాంతి ఉంటుందట. ఈ దృగ్విషయం శీతాకాలపు అయనాంతం (Winter Solstice) అంటారు.
ఈ సమయంలో భూమి తన ఉత్తర ధ్రువాన్ని సూర్యుడి నుండి దూరంగా మొగ్గు చూపుతుందని, దీనివల్ల సుదీర్ఘ రాత్రులు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు.
ఎందుకిలా జరుగుతుంది?
భూమి సూర్యుడి నుండి దూరంగా ఉన్నప్పుడు, దీనిని శీతాకాలపు అయనాంతం అంటారు. మరల భూమి సూర్యుడి దగ్గరికి వచ్చే వేసవికాలపు అయనాంతం సమయంలో మాత్రం పగలు ఎక్కువగా ఉంటాయి.