శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పాములు, తాబేళ్ల కలకలం

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పాములు, తాబేళ్ల కలకలం

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (Shamshabad International Airport)లో అరుదైన పాములు (Snakes), తాబేళ్లు (Tortoises) పట్టుబడి కలకలం రేపాయి. బ్యాంకాక్ (Bangkok) నుంచి భారత్‌ (India)కు అక్రమ రవాణా చేస్తున్న 37 వన్య‌ప్రాణుల‌ను (Wild Animals) కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం హైద‌రాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంట‌ర్నేష‌నల్ ఎయిర్‌పోర్ట్ నుంచి అక్రమంగా 28 రెడ్ టెయిల్డ్ బాంబూ పిట్ వైపర్లు, 3 స్పైడర్ టెయిల్డ్ హార్మ్ వైపర్లు, 6 తాబేళ్లు ఇలా మొత్తం 37 వన్య‌ప్రాణులను ముంబయి (Mumbai)కి తరలించే ప్రయత్నం చేశారు.

ఇద్ద‌రు వ్య‌క్తుల‌పై అనుమానం రావ‌డంతో క‌స్ట‌మ్స్ అధికారులు సోదాలు జ‌రిపారు. వారి ల‌గేజ్ బ్యాగ్‌ల‌ను త‌నికీ చేయ‌గా ప్రాణంతో ఉన్న 37 వ‌న్య‌ప్రాణులు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఈ అక్రమ రవాణా వెనుక షేక్ నిజాముద్దీన్ (Sheikh Nizamuddin) మరియు షేక్ అల్తాఫ్ అలీ (Sheikh Altaf Ali) ఉన్నట్లు గుర్తించారు. ఈ అరుదైన జంతువుల విలువ ల‌క్ష‌ల్లో ఉంటుంద‌ని అధికారులు చెబుతున్నారు. అనుమ‌తులు లేకుండా విదేశాల నుంచి ఈ రకమైన జీవులను రవాణా చేయడం నిబంధనలకు విరుద్ధం. ఈ ఘటనపై అధికారాలు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాయి.

వన్యప్రాణుల అక్రమ రవాణా పెరుగుతున్న తరుణంలో ఈ ఘటన కొత్త చర్చకు దారి తీస్తోంది. అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుల్లో భద్రతా చర్యలను మరింత కఠినంగా అమలు చేయాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోందంటున్నారు జంతు ప్రేమికులు.

Join WhatsApp

Join Now

Leave a Comment