జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెన్‌డ్రైవ్ తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ వద్ద ఉందని బాధితురాలు లక్ష్మీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ పెన్‌డ్రైవ్‌లో ఏముందనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. ఆ పెన్‌డ్రైవ్‌ను అడ్డంపెట్టుకొని సీఎం చంద్రబాబును అయినా, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ను అయినా, ఎవరినైనా తిట్టొచ్చు అని, అవసరమైతే పవన్ కళ్యాణ్‌ను కూడా బ్లాక్‌మెయిల్ చేస్తా.. నువ్వెంత
అని కిరణ్ రాయల్ తనతో అనేక సందర్భాల్లో చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పేవాడని బాధితురాలు లక్ష్మీ స్పష్టం చేశారు.
ఎంత నీచానికైనా దిగజారిపోతావా..? ఎవర్ని చూసుకొని నీకు ఇదంతా.. అనే క్వశ్చన్‌ను కిరణ్ రాయల్‌ను అడిగితే.. పవన్ పెన్ డ్రైవ్ నా వద్ద ఉంది, ఆయన డీటైల్స్ నా దగ్గర ఉన్నాయి. నా వెనకాల పవన్ ఉన్నాడు
అని అనేకసార్లు చెప్పాడని, నిజంగా కిరణ్ రాయల్ వెనకాల పవన్ ఉన్నారా..? అని ప్రశ్నించారు. దండం పెట్టి అన్నగా భావించి న్యాయం చేయండి అని పవన్‌ను కోరినా పట్టించుకోలేదన్నారు. ఎవరి సపోర్టు లేకుండా అతను జైపూర్ పోలీసులను పంపించి ఉండరని, అతని వెనకాల ఎవరు ఉన్నారో తేలాలని లక్ష్మీ అన్నారు.
ఏముందా పెన్‌డ్రైవ్‌లో..?
అవసరమైతే పవన్ కళ్యాణ్నే బ్లాక్ చేస్తానన్నాడంటే.. అందులో మూడో కంటికి తెలియని ఏపీ డిప్యూటీ సీఎంకు సంబంధించిన కీలక సమాచారం ఏదైనా ఉండాలి. లేదా పార్టీకి సంబంధించిన ఆర్థిక పరమైన లావాదేవీలైనా అయ్యిండాలనే చర్చ అందరిలోనూ మొదలైంది. ప్రస్తుతం కూటమిలో ఉన్న జనసేన పార్టీ భవిష్యత్తు వ్యూహమైనా నిక్షిప్తమై ఉండొచ్చా అనే వాదన కూడా ఉంది. అధినేతనే బ్లాక్ మెయిల్ చేస్తాననే మాట అమ్మాయి ముందు బడాయికి చెప్పేంత చిన్నమాటేం కాదు. ఎందుకంటే ఒక అధినేత పట్ల విధేయతతో ఉన్నవారెవ్వరూ అంత పెద్ద పదాన్ని ఉపయోగించరు, ఆ ఆలోచన కూడా రాదు. కాబట్టి కిరణ్ రాయల్ వద్ద ఉన్న పెన్ డ్రైవ్‌లో ఏముందనే ప్రశ్న ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మిలియన్ డాలర్ క్వశ్చన్‌గా మారింది.