తెలంగాణ వాటర్‌బోర్డు వెబ్‌సైట్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేయడం కలకలం రేపింది. ఈ ఘటనలో బోర్డు అధికారులకు సంబంధించిన కీలక వివరాలు, కాంటాక్ట్ డేటా, ఇతర ముఖ్యమైన సమాచారం పూర్తిగా మాయం అయినట్లు తెలుస్తోంది. వెబ్‌సైట్‌లో ఉన్న మొత్తం డేటాను సైబర్ నేరగాళ్లు తుడిచిపెట్టినట్లు సమాచారం. అయితే, ఐటీ విభాగం ఇప్పటి వరకు రికవరీ చేయడంలో విఫలమైంది. బోర్డు అధికారులు ఈ విషయంపై గోప్యత వహిస్తుండటంతో పూర్తి వివరాలు బయటపడటం లేదు. ఇది సైబర్ భద్రతలో తీవ్ర లోపాలను చూపిస్తోంది.
వాటర్‌బోర్డ్ వెబ్‌సైట్‌పై సైబర్ దాడి.. కీలక సమాచారం మాయం
