వరంగల్ జిల్లా (Warangal District) పూజారి కాంకేర్ (Pujari Kanker) పరిధిలో గురువారం తెల్లవారుజామున తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆపరేషన్ కగార్ (Operation Kagar) లో భాగంగా మూడు రోజులుగా భద్రతా బలగాలు ముమ్మరంగా కూంబింగ్ చేపట్టాయి. కర్రిగుట్టల అడవుల్లో సుమారు 2500 మంది మావోయిస్టులు (Maoists) ఉన్నట్టు సమాచారంతో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. గురువారం ఉదయం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్ర బలగాలపై మావోలు ఎదురుదాడికి దిగారు.
ఈ సమయంలో జరిగిన భారీ ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు (Five Maoists) మృతి (Killed) చెందినట్లు సమాచారం. ఘటన స్థలంలో ఇప్పటికీ కాల్పుల శబ్దం వినిపిస్తూ ఉండటం గమనార్హం. కేంద్ర బలగాలు కర్రిగుట్ట ప్రదేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని, భారీగా సెర్చ్ ఆపరేషన్ (Search Operation) చేపట్టాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాల్పుల శబ్దాలతో చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
ఈ ప్రాంతం గతంలోనూ మావోయిస్టు చట్రాలకు కేంద్రంగా నిలిచిన నేపథ్యంలో భద్రతా బలగాలు మరింత అప్రమత్తంగా ఉన్నట్లు సమాచారం. అడవిలో కూంబింగ్ చేపట్టిన కేంద్ర భద్రత బలగాలకు మూడు హెలికాప్టర్ ద్వారా అటు బీజాపూర్ జిల్లా నుండి ఇటు ములుగు జిల్లా నుండి మంచినీటి ఆహారం, ఎన్‌కౌంటర్ (Encounter)కి ఉపయోగించే బాంబులు గన్నులు ఆయుధాలు హెలికాప్టర్‌లో తీసుకువెళ్లాయి.