మళ్లీ గాంధీభవన్‌కు చేరిన వరంగల్ పంచాయితీ

మళ్లీ గాంధీభవన్‌కు చేరిన వరంగల్ పంచాయితీ

వరంగల్ జిల్లా (Warangal District) కాంగ్రెస్ నేతల (Congress Leaders) మధ్య విభేదాలు మరోసారి గాంధీభవన్‌ (Gandhi Bhavan)కు చేరాయి. క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి (Mallu Ravi)తో వరంగల్ కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు.

ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కేఆర్‌ నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కుడా ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు. కొండా మురళి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో క్రమశిక్షణ కమిటీ గతంలో ఆయనకు నోటీసులు జారీ చేసి వివరణ కోరింది. తాజాగా, కొండా మురళి వ్యతిరేక వర్గం నేతలు నేడు కమిటీ ముందు తమ వాదనలు వినిపించారు. ఈ అంశంపై కమిటీ తదుపరి చర్యలు తీసుకోనుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment