జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) అభిమానులకు మే 20 ఒక పండగ రోజు. ఎన్టీఆర్ 42వ పుట్టినరోజు (Birthday) సందర్భంగా ‘వార్ 2’ (War 2) చిత్ర బృందం అభిమానులకు భారీ సర్‌ప్రైజ్ అందించింది. యశ్ రాజ్ ఫిల్మ్స్ (వైఆర్‌ఎఫ్) (Yash Raj Films – YRF) నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ నుంచి స్పెషల్ టీజర్ (Teaser) విడుదలైంది. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. టీజర్‌లో ఎన్టీఆర్ పవర్‌ఫుల్ లుక్‌తో అభిమానులను ఆకట్టుకున్నారు, హాలీవుడ్ స్థాయి యాక్షన్‌తో ఈ చిత్రం ఎంత గ్రాండ్‌గా ఉంటుందని తెలుస్తోంది. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదలైన ఈ టీజర్‌లో ఎన్టీఆర్ స్వయంగా డబ్బింగ్ చెప్పడం విశేషం.
‘వార్ 2’ లో ఎన్టీఆర్ మాస్ ఎంట్రీ
మంగళవారం 11 గంటలకు వైఆర్‌ఎఫ్ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా విడుదలైన ‘వార్ 2’ స్పెషల్ టీజర్ అభిమానుల హృదయాలను కొల్లగొట్టింది. ఈ 95 సెకన్ల టీజర్‌లో ఎన్టీఆర్ సముద్రంలో పైరేట్స్‌తో హ్యాండ్-టు-హ్యాండ్ కంబాట్‌లో పాల్గొనే ఒక ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌తో పరిచయం అవుతాడు. అతని శక్తివంతమైన స్క్రీన్ ప్రెజెన్స్, తీక్షణమైన లుక్, హాలీవుడ్ స్టైల్ యాక్షన్ అభిమానులను ఉర్రూతలూగించాయి. ఈ టీజర్‌లో హృతిక్ రోషన్ పాత్ర మేజర్ కబీర్ ధలివాల్‌కు సంబంధించిన చిన్న హింట్ కూడా ఉంది.
టీజర్‌లో ఎన్టీఆర్ “నా కళ్లు నిన్ను ఎప్పటి నుంచో వెంటాడుతూనే ఉన్నాయి కబీర్.. ఇండియాస్ బెస్ట్ సోల్జర్.. రా లో బెస్ట్ ఏజెంట్” అని అని చెప్పిన డైలాగ్ అతని పాత్ర ఇంటెన్సిటీని, కథలో అతని ప్రాముఖ్యతను సూచిస్తుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో, ఈ చిత్రం విజువల్‌గా అద్భుతంగా ఉంటుందని ఈ టీజర్ స్పష్టం చేసింది. ఆగస్టు 14, 2025న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ యాక్షన్ ఫెస్టివల్ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.








