యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR), బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan)తో కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ‘వార్ 2’ (War 2). యష్ రాజ్ ఫిల్మ్స్ (Yash Raj Films) నిర్మిస్తున్న ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ (Ayan Mukerji) దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఈ ఏడాది ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగులో ఈ సినిమాను సితార నాగవంశీ (Sithara Naga Vamsi) భారీ ధరకు కొనుగోలు చేసి రిలీజ్ చేస్తున్నారు.
ఇప్పటివరకు ఈ సినిమా నుండి పెద్దగా ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ బయటకు రాలేదు. నేరుగా థియేటర్లలోనే విజువల్ ఫీస్ట్‌ను అందించాలని మేకర్స్ ప్లాన్ చేసినట్లున్నారు. మరోవైపు, ‘వార్ 2’కి పోటీగా వస్తున్న ‘కూలీ’ సినిమా ప్రమోషనల్ కంటెంట్‌తో దూసుకుపోతోంది. దీంతో ‘వార్ 2’ మేకర్స్‌పై ఒత్తిడి పెరిగింది. సాంగ్స్, ప్రోమోలు విడుదల చేయాలని సోషల్ మీడియాలో యష్ రాజ్ ఫిల్మ్స్ను ట్యాగ్ చేస్తూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
దీనిని గమనించిన మేకర్స్ ప్రమోషన్స్‌ను పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా, ‘వార్ 2’ ట్రైలర్ విడుదల తేదీని ఖరారు చేసారు. ఈ నెల 25న ‘వార్ 2’ ట్రైలర్‌ను విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ఒక పోస్టర్‌ను విడుదల చేసారు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు, హృతిక్ అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ‘వార్ 2’ విడుదల కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. నాగవంశీ ప్రీమియర్స్ కూడా వేసేలా ప్లాన్ చేస్తున్నారు.







