వార్ 2 ఓవర్సీస్ రివ్యూ: ఎన్టీఆర్-హృతిక్ జోడీ అదరగొట్టిందా?

వార్ 2 ఓవర్సీస్ రివ్యూ: ఎన్టీఆర్-హృతిక్ జోడీ అదరగొట్టిందా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కలిసి నటించిన బిగ్గెస్ట్ యాక్షన్ చిత్రం ‘వార్ 2’. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ స్పై సినిమాటిక్ యూనివర్స్ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించారు. ఎన్టీఆర్ నటించిన తొలి స్ట్రెయిట్ బాలీవుడ్ చిత్రం కావడంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

అంచనాలకు తగ్గట్టే గ్రాండ్ ప్రీమియర్లతో నేడు థియేటర్లలో విడుదలైన ‘వార్ 2’ ఎలా ఉందంటే.. ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్ అభిమానులకు పూనకాలు తెప్పించడం ఖాయం. అయితే కథనం రెగ్యులర్ స్పై టెంప్లేట్‌లోనే సాగుతుంది. ఫస్ట్ హాఫ్‌లో వచ్చే ‘సలామ్ అనాలి’ పాటలో ఎన్టీఆర్, హృతిక్ ఇద్దరూ పోటాపోటీగా డాన్స్‌లతో అదరగొట్టారు. ఇంటర్వెల్‌లో వచ్చే ట్విస్ట్ సూపర్ గా ఉంటుంది. డీసెంట్‌గా ప్రారంభమైన సెకండాఫ్ కాస్త నెమ్మదిగా సాగుతుంది. మధ్యలో వచ్చే యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ మాత్రం గూస్ బంప్స్ తెప్పిస్తుంది.

మొత్తంగా చూస్తే, ‘వార్ 2’ గతంలో వచ్చిన ‘టైగర్ 3’ కంటే మెరుగ్గా ఉంది. కియారా అద్వానీ పాత్రకు ఒక పాట, ఒక ఫైట్ తప్ప పెద్దగా ప్రాధాన్యత లేదు. ఈ సినిమాకు ప్రధానమైన లోపం VFX అని చెప్పాలి. ముఖ్యంగా బోట్ ఛేజింగ్ సీక్వెన్స్‌లో VFX నాసిరకంగా ఉన్నాయి. అయితే అయాన్ ముఖర్జీ ఎన్టీఆర్‌ను చాలా బాగా చూపించారని చెప్పొచ్చు. అభిమానులు ఆశించే మాస్ సినిమా కాకుండా, బాలీవుడ్ స్థాయి స్పై సినిమాను ఆశించవచ్చు. మొత్తం మీద, ‘వార్ 2’ ఈ వారాంతానికి ఒక మంచి ఎంపిక.

Join WhatsApp

Join Now

Leave a Comment