బాలీవుడ్ (Bollywood) యాక్షన్ ఫ్రాంచైజీకి చెందిన భారీ ప్రాజెక్ట్ ‘వార్ 2’ (‘War 2’) విడుదలకు ముస్తాబవుతోంది. హృతిక్ రోషన్ (Hrithik Roshan), యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR) కలిసి నటించిన ఈ మల్టీస్టారర్ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేపుతోంది. కాగా, ఈ సినిమా విడుదల తేదీ ఫిక్స్ అయ్యింది. ఆగస్టు 14న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. దేశవ్యాప్తంగా ఈ సినిమాను డాల్బీ అట్‌మోస్ థియేటర్లలో ప్రదర్శించనున్నారు. దీంతో భారీస్థాయిలో విడుదల కానున్న తొలి భారతీయ డాల్బీ (First India Dolby) సినిమాగా(Film) ఇది రికార్డు సృష్టించింది.
ఆయాన్ ముఖర్జీ (Ayan Mukerji) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హృతిక్ రోషన్‌తో పాటు టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. కియారా అద్వానీ (Kiara Advani) కథానాయికగా నటిస్తుండగా, ట్రైలర్‌కి అన్ని భాషల్లోనూ అద్భుత స్పందన లభిస్తోంది. విడుదలైన కేవలం కొన్ని రోజుల్లోనే ట్రైలర్ 90 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కించుకుని సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది.
విజువల్స్, స్టంట్స్, సంగీతం, ప్రతి ఫ్రేమ్ కూడా హై స్టాండర్డ్స్‌ను సూచిస్తున్నాయి. గ్రాండ్ యాక్షన్ ఎపిసోడ్స్‌తో పాటు ఎన్టీఆర్ – హృతిక్ మధ్య పోరాటాలు ఈ సినిమాపై మరింత హైప్ తీసుకొచ్చాయి. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా సినిమా విడుదలకానుండటంతో దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆసక్తి పెరిగింది. ఇండియన్ యాక్షన్ సినిమాల స్థాయిని మరింత పెంచేలా ‘వార్ 2’ కనిపిస్తోంది.








