వక్ఫ్ బోర్డు బిల్లు (Waqf Board Bill)ను వ్యతిరేకిస్తూ ముస్లింల జాయింట్ యాక్షన్ కమిటీ (Muslim JAC) ఆధ్వర్యంలో ఆదివారం చిలకలూరిపేట (Chilakaluripet) లో శాంతి ర్యాలీ నిర్వహించారు. చౌత్రా సెంటర్ (Chowtra Centre) నుంచి రిజిస్టర్ కార్యాలయం (Registrar Office) వరకు ఈ ర్యాలీ కొనసాగింది.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి విడదల రజిని (Former Minister Vidadala Rajini) కూడా పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తలతో కలిసి ఆమె ర్యాలీలో నడిచి, బిల్లుపై తన వ్యతిరేకతను (Opposition) వ్యక్తం చేశారు.
ముస్లింలకు అండగా ఉంటాం విడదల రజిని
వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలంటూ (Repeal Demand) డిమాండ్ చేస్తున్న ముస్లిం మైనార్టీ వర్గాలకు వైసీపీ (YSRCP) అండగా ఉంటుందని తెలిపారు.
వక్ఫ్ సవరణ చట్టంను లోకసభ (Lok Sabha) లో, రాజ్యసభ (Rajya Sabha) లో తమ పార్టీ వ్యతిరేకించిందని ఉభయసభల్లో ఈ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తమ పార్టీ ఓటు వేసిందని,సుప్రీం కోర్టు (Supreme Court) లో కూడా ఈ వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా వైసీపీ పిటీషన్ దాఖలు చేసిందని తెలిపారు.
ముస్లింలకు తెలుగుదేశం పార్టీ (TDP) తీరని ద్రోహం చేసిందని విడదల రజిని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ముస్లింల చేత ఓట్లు వేయించుకుని వెన్నుపోటు పొడిచిందని ఆరోపించారు. వక్ఫ్ సవరణ చట్టంపై తెలుగుదేశం పార్టీ దొంగ నాటకాలు ఆడుతుందని ఆగ్రహించారు. నిజంగా టీడీపీకి ముస్లింల పైన ప్రేమ ఉంటే సవరణ చట్టం పైన సుప్రీంకోర్టును ఆశ్రయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లింలు అధిక సంఖ్యలో పాల్గొని కూటమి ప్రభుత్వానికి (Coalition Government) వ్యతిరేకంగా నినాదాలు (Slogans) చేశారు.