‘వ్యూహం’ సినిమా నిర్మాత అరెస్ట్.. విజ‌య‌వాడ‌కు త‌ర‌లింపు

‘వ్యూహం’ సినిమా నిర్మాత అరెస్ట్.. విజ‌య‌వాడ‌కు త‌ర‌లింపు

ఏపీ మాజీ (AP Former) సీఎం జ‌గ‌న్ (CM Jagan) జీవిత క‌థ ఆధారంగా నిర్మించిన‌ ‘వ్యూహం’(‘Vyuham’) సినిమా నిర్మాత దాసరి కిరణ్‌ (Dasari Kiran)ను పోలీసులు అరెస్ట్(Arrest) చేశారు. ఆర్థిక లావాదేవీల విషయంలో వివాదం తలెత్తడంతో, విజయవాడ పటమట పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. హైదరాబాదులో అదుపులోకి తీసుకున్న కిరణ్‌ను విజయవాడ (Vijayawada)కు తరలించారు. బంధువుల వద్ద తీసుకున్న అప్పు చెల్లించమన్నందుకు దాడి చేయించారని దాసరి కిరణ్‌పై ఆరోపణలు ఉన్నాయి.

గతంలో కూడా ‘వ్యూహం’ సినిమా వివాదాల్లో చిక్కుకుంది. ఈ చిత్ర దర్శకుడు రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma)పై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ప‌వన్‌, క‌ళ్యాణ్ (Pawan Kalyan) లోకేష్‌ (Lokesh)లపై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టారన్న ఆరోపణలపై వర్మకు నోటీసులు జారీ చేయగా, ఆయన కోర్టులో పోరాడుతున్నారు.

అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఫైబర్‌నెట్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న జీవీ రెడ్డి కూడా తన రాజీనామాకు ముందు ‘వ్యూహం’ సినిమా విషయంపై రాంగోపాల్ వర్మకు నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు నిర్మాత అరెస్టుతో ఈ సినిమా మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment