విశాఖపట్నం (Visakhapatnam)లోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) (HPCL) రిఫైనరీ (Refinery)లో భారీ పేలుడు సంభవించింది. రఫ్‌సైట్ బ్లూషెడ్ (Roughsite Blueshed) వద్ద ఉన్న గ్యాస్ కంప్రెషర్ (Gas Compressor) పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. పేలుడుతో భయభ్రాంతులకు గురైన కార్మికులు బయటకు పరుగులు తీశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, పైప్‌లైన్ లీకేజీ కారణంగా వేజల్ పేలిందని తెలుస్తోంది.
ఈ ఘటన శుక్రవారం ఉదయం 9:20 గంటలకు జరిగింది. పేలుడు గురించి సమాచారం అందిన వెంటనే, అగ్నిమాపక మరియు భద్రతా అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వేజల్ పేలిన సమయంలో ఎంత మంది కార్మికులు లోపల ఉన్నారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే, వందలాది మంది కార్మికులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.







