మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ప్రధాన పాత్రలో రూపొందుతోన్న భారీ ఫాంటసీ విజువల్ ఎక్స్‌పీరియెన్స్ మూవీ ‘విశ్వంభర’ (Vishwambhara)’నుంచి తాజాగా ఓ స్పెషల్ ట్రీట్ విడుదలైంది. యువ దర్శకుడు వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ మైథలాజికల్ డ్రామా ఇప్పటికే వచ్చిన ప్రతి అప్డేట్‌తో సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పింది. ఎం.ఎం. కీరవాణి సంగీతం (M.M Keeravani) అందిస్తుండగా, యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో ఎంతో గ్రాండ్‌గా నిర్మిస్తోంది.
ఈ క్రమంలో, సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న ఆషిక రంగనాథ్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఓ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో ఆమె లుక్‌కు నెటిజన్లు ఓ రేంజ్‌లో ఫిదా అవుతున్నారు.
“ఆషిక కళ్లలో మ్యాజిక్ ఉంది!”
ఆషిక అందాన్ని, ఆమె క్యారెక్టర్‌కు ఉన్న డెప్త్‌ను హైలైట్ చేస్తూ రిలీజ్ చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “ఆషిక లుక్ బ్యూటిఫుల్”, “విశ్వంభరలో ఆమె పాత్ర హైలైట్ కానుంది” అంటూ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. చిరంజీవి సరసన త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆషిక రంగనాథ్ రెండో హీరోయిన్‌గా కనిపించనున్నారు. కన్నడ బ్యూటీగా మంచి క్రేజ్ ఉన్న ఆమెకు ఈ చిత్రం టాలీవుడ్‌లో మైలురాయిగా నిలవనుంది.
భారీ ప్రమోషన్స్‌కు శ్రీకారం
ఈ బర్త్‌డే పోస్టర్‌తో మొదలైన ప్రమోషన్ రన్ ఇక నుంచి రెగ్యులర్‌గా సాగనున్నట్టు తెలుస్తోంది. చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న యూవీ క్రియేషన్స్, ప్రమోషనల్ స్ట్రాటజీలో కూడా కొత్తదనం చూపించబోతున్నారట. సినిమా కోసం ప్రత్యేకంగా వేసిన భారీ సెట్‌లు, అద్భుత విజువల్ ఎఫెక్ట్స్, మైథలాజికల్ టచ్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలవబోతున్నాయి.వినాయక చవితి లేదా దసరా సీజన్‌లో ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.