విశ్వక్ సేన్ ‘ఫంకీ’ స్టోరీ లీక్.. నిర్మాత షాకింగ్ రివీల్

విశ్వక్ సేన్ ‘ఫంకీ’ స్టోరీ లీక్.. నిర్మాత షాకింగ్ రివీల్

విశ్వక్ సేన్ (Vishwak Sen) మరియు జాతిరత్నాలు (Jathi Ratnalu) ఫేమ్ అనుదీప్ (Anudeep) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘ఫంకీ’ (Funky). ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాన్ని నిర్మాత నాగవంశీ (Naga Vamsi) బయటపెట్టేశారు. ‘ఫంకీ’ స్టోరీ ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) జీవిత కథ ఆధారంగా ఉండొచ్చని తెలిపారు. ఈ కథ ఓ యంగ్ డైరెక్టర్ – ప్రొడ్యూసర్ కూతురి మధ్య ప్రేమాయణం ఎలా మొదలైందో వినోదాత్మకంగా చూపించనున్నట్లు చెప్పారు. అంతేకాదు, ఈ కథలో హీరోయిన్ పాత్ర డామినేటెడ్‌గా ఉంటుందని కూడా వెల్లడించారు. ఈ చిత్రంలో కయాదు లోహర్ (Kayadu Lohar) హీరోయిన్‌గా నటించనుండగా, ఇప్పటికే సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిపోయింది.

లైలా (Laila) సినిమా డిజాస్ట‌ర్ త‌రువాత ఫంకీ పేరుతో రొమాంటిక్ ల‌వ్ డ్రామా మూవీతో విశ్వ‌క్‌సేన్ (Vishwak Sen) ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ (Sitara Entertainments) ప‌తాకంపై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ (Suryadevara Naga Vamsi) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌తో అఫీషియ‌ల్‌గా లాంఛ్ అయ్యింది.

Join WhatsApp

Join Now

Leave a Comment