‘కల్ట్’తో దర్శకుడిగా విశ్వ‌క్‌సేన్‌ రీ-ఎంట్రీ

‘కల్ట్’తో దర్శకుడిగా విశ్వ‌క్‌సేన్‌ రీ-ఎంట్రీ

యంగ్ హీరోగా తనదైన స్టైల్, ఎనర్జీతో యువతను ఆకట్టుకుంటున్న విశ్వక్‌సేన్‌ ఇప్పుడు మరోసారి దర్శకుడిగా రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నారు. తన కొత్త చిత్రం “కల్ట్” (CULT) ద్వారా ఆయన మళ్లీ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఇది విశ్వక్‌సేన్ దర్శకత్వం వహిస్తున్న రెండవ చిత్రం కానుంది. “ఫలక్‌నుమా దాస్”తో దర్శకుడిగా అరంగేట్రం చేసిన విశ్వక్, దాస్ కా ధ‌మ్కీ చిత్రం త‌రువాత‌ ఇప్పుడు “కల్ట్”తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

‘కల్ట్’ పూజా కార్యక్రమం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో జరిగింది. నేటి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. “కల్ట్” పోస్టర్‌ను ఇటీవల విడుదల చేశారు. విభిన్న కాన్సెప్ట్‌తో కూడిన యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. పోస్టర్‌లో పలు సన్నివేశాల స్పష్టత లేకపోయినా, సినిమా బోల్డ్, ఇంటెన్స్ కాన్సెప్ట్‌తో ఉండబోతున్నదనే సంకేతాలు అందిస్తున్నాయి.

ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్‌తో పాటు ప్రొడక్షన్ బాధ్యతలు కూడా విశ్వక్‌సేన్‌ తీసుకున్నాడు. విశ్వక్‌సేన్ నటన, మాస్ అటిట్యూడ్‌తో పాటు దర్శకుడిగా కూడా ఏ స్థాయిలో అలరించగలడన్న ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఆయన తీసిన మొదటి చిత్రం “ఫలక్‌నుమా దాస్”కు యూత్‌లో మంచి రెస్పాన్స్ రావడంతో, ఇప్పుడు “కల్ట్”పై అంచనాలు భారీగానే ఉన్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment