తమిళ సినీ నటుడు, నిర్మాత విశాల్ (Vishal) త్వరలో పెళ్లిపీటలెక్కనున్నారు. హీరోయిన్ (Actress) సాయి ధన్సిక (Sai Dhansika)ను తాను వివాహం (Marriage) చేసుకోబోతున్నట్లుగా అధికారికంగా (Officially) ప్రకటించారు. చెన్నైలో జరిగిన సాయి ధన్సిక రాబోయే చిత్రం ‘యోగి డా’ (Yogi Da) ఆడియో, ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (Trailer Launch Event)లో ఈ జంట తమ సంబంధాన్ని బహిరంగంగా వెల్లడించి, వివాహ తేదీని ప్రకటించారు. ఈ ప్రకటన సినీ పరిశ్రమ, అభిమానుల మధ్య సంచలనం సృష్టించింది.
ప్రేమకథ..
సాయి ధన్సిక ‘యోగి డా’ ఈవెంట్‌లో మాట్లాడుతూ.. తాను విశాల్ గత 15 సంవత్సరాలుగా స్నేహితులుగా ఉన్నామని, ఇటీవలే తమ సంబంధం ప్రేమగా మారిందని తెలిపారు. “మేము ఒక వార్తా కథనం చూశాం. అందుకే మేము మా సంబంధాన్ని దాచాలనుకోవడం లేదు. మేము ఆగస్టు 29న వివాహం చేసుకోబోతున్నాము. విశాల్ ఎల్లప్పుడూ నన్ను గౌరవంగా చూసుకున్నారు. నాకు ఏ సమస్య వచ్చినా, అతను నా కోసం నిలబడ్డారు. ఒకసారి నా ఇంటికి కూడా వచ్చారు, అది నాకు చాలా ఆనందాన్నిచ్చింది” అని ధన్సిక తెలిపారు. ఆమె విశాల్‌ను ఉద్దేశించి, “నువ్వు నా ప్రేమతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను” అని ఎమోషనల్ అయ్యారు.
విశాల్ కూడా ఈ సందర్భంగా మాట్లాడుతూ, తన జీవితంలో సాయి ధన్సిక ఒక వరంగా వచ్చిందని, ఇద్దరం కలిసి అందమైన జీవితాన్ని గడపబోతున్నామని అన్నారు. “నేను చాలా సంవత్సరాల క్రితం నడిగర్ సంగం భవనం నిర్మాణం పూర్తయ్యాకే పెళ్లి చేసుకుంటానని చెప్పను. ఇప్పుడు ఆ భవనం పూర్తి కావొస్తోంది. నా ప్రియురాలి పేరు సాయి ధన్సిక. ఆమె నా సహచరి, నేను ఆమెను ప్రేమిస్తున్నాను” అని విశాల్ చెప్పారు.
విశాల్ గత సంబంధాలు
గతంలో విశాల్ పలు సంబంధాలతో వార్తల్లో నిలిచారు. 2019లో అతను వ్యాపారవేత్త అనిషా అల్లా రెడ్డితో నిశ్చితార్థం చేసుకున్నారు, కానీ ఆ సంబంధం అర్థాంతరంగా ఆగిపోయింది. ఆ తర్వాత, నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌తో అతని సంబంధం గురించి పుకార్లు వచ్చాయి, కానీ వారు దానిని ధృవీకరించలేదు. వరలక్ష్మి ఇటీవల నికోలై సచ్‌దేవ్‌ను వివాహం చేసుకున్నారు.
అభిమానుల స్పందన
ఈ జంట ప్రకటన తర్వాత, సోషల్ మీడియాలో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈవెంట్ నుంచి విశాల్ మరియు ధన్సిక ఒకరినొకరు ఆలింగనం చేసుకుని, చేతులు పట్టుకున్న వీడియోలు వైరల్‌గా మారాయి. ఒక వీడియోలో ధన్సిక మాట్లాడుతుండగా విశాల్ సిగ్గుతో నవ్వుతూ, ఆమెను ముద్దాడిన దృశ్యం అభిమానుల హృదయాలను కొల్లగొట్టింది.