హీరో విశాల్‌కు మ‌ద్రాస్ హైకోర్టు షాక్‌

హీరో విశాల్‌కు మ‌ద్రాస్ హైకోర్టు షాక్‌

సినీ నటుడు, నిర్మాత విశాల్‌ (Vishal) కు మ‌ద్రాస్ హైకోర్టు (Madras High Court) నుంచి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions) దాఖలు చేసిన సివిల్ కేసు (Civil Case)లో కోర్టు, విశాల్‌ను రూ.21.29 కోట్లను 30 శాతం వడ్డీతో సహా చెల్లించాలని ఆదేశించింది. ఈ తీర్పు కోలీవుడ్‌ (Kollywood) లో సంచలనంగా మారింది.

వివరాల్లోకి వెళితే.. విశాల్ 2016లో తన చిత్రం ‘మరుదు’ (Marudhu) నిర్మాణం కోసం గోపురం ఫిల్మ్స్‌కు (Gopuram Films) చెందిన అన్బుచెజియన్ (Anbuchezhiyan) నుంచి రూ.15 కోట్ల రుణం (Loan) తీసుకున్నారు. ఈ రుణాన్ని తిరిగి చెల్లించలేకపోవడంతో, 2019 నాటికి వడ్డీతో కలిపి ఈ మొత్తం రూ.21.29 కోట్లకు చేరింది. ఈ పరిస్థితిలో లైకా ప్రొడక్షన్స్, విశాల్ రుణాన్ని తీర్చేందుకు ముందుకొచ్చి, అన్బుచెజియన్‌కు ఈ మొత్తాన్ని చెల్లించింది. ఒప్పందం ప్రకారం, విశాల్ ఈ మొత్తాన్ని 30 శాతం వడ్డీతో లైకాకు తిరిగి చెల్లించాల్సి ఉంది, అలాగే అతని భవిష్యత్ చిత్రాల హక్కులు రుణం తీరే వరకు లైకాకు చెందుతాయని నిబంధన ఉంది.

అయితే, విశాల్ ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించి, తన చిత్రం ‘వీరమై వాగై సూడమ్ (Veeramae Vaagai Soodum)’ హక్కులను 2022లో వేరే సంస్థకు అమ్మేశారు. దీనిపై లైకా ప్రొడక్షన్స్ 2021లో మద్రాస్ హైకోర్టులో సివిల్ కేసు దాఖలు చేసింది. ఈ కేసులో రెండున్నర సంవత్సరాల విచారణ అనంతరం, కోర్టు లైకా వాదనలతో ఏకీభవిస్తూ, విశాల్‌ను రూ.21.29 కోట్లు 30 శాతం వడ్డీతో చెల్లించాలని ఆదేశించింది.

గతంలో, 2021లో లైకా దాఖలు చేసిన ఒక దరఖాస్తును తిరస్కరిస్తూ, మద్రాస్ హైకోర్టు లైకాపై రూ.5 లక్షల జరిమానా విధించి, ఆ మొత్తాన్ని విశాల్‌కు చెల్లించాలని ఆదేశించింది. అయితే, తాజా తీర్పు విశాల్‌కు ఆర్థికంగా గట్టి దెబ్బ తీసినట్లైంది. విశాల్ ప్రస్తుతం ‘తుప్పరివాళన్ 2’ మరియు ‘విశాల్ 34’ వంటి చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈ తీర్పు అతని ఆర్థిక వ్యవహారాలపై, అలాగే భవిష్యత్ చిత్ర నిర్మాణాలపై ఎలాంటి ప్రభావం చూపనుందన్నది ఆసక్తికరంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment