విశాఖ (Visakhapatnam) నగరంలో అర్ధరాత్రి (Midnight) జరిగిన కాల్పుల (Firing) ఘటన కలకలం రేపింది. వన్ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చేపల రాజేష్ (Chepala Rajesh) అనే వ్యక్తిపై నాటు తుపాకీ gun)తో కాల్పులు జరగడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. తీవ్రగాయాలపాలైన రాజేష్‌ను కేజీహెచ్(KGH)కు తరలించగా, ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనతో నగరంలో గన్ కల్చర్ పెరుగుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
కాల్పుల ఘటన వెనుక షాకింగ్ ట్విస్ట్ బయటపడింది. మహారాణి పేట క్రైమ్ కానిస్టేబుల్ (Crime Constable) నాయుడు(Naidu), దొంగ బొగ్గు (Illegal Coal) తరలింపు వ్యవహారంలో రాజేష్‌తో తీవ్ర విభేదాలు పెట్టుకున్నాడని సమాచారం. పోర్ట్‌లో బొగ్గు అక్రమ రవాణాపై ఈ వీరిద్దరి మధ్యా పెద్ద గొడవలు చోటు చేసుకున్నాయని, అదే కక్ష్యతో రాజేష్‌పై కాల్పులు జరిగాయని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడైన మణికంఠ (Manikantha) కు కానిస్టేబుల్ నాయుడు సూపరీ ఇచ్చినట్టు బయటపడటంతో ఈ ఘటన మరింత సంచలనంగా మారింది.
చిలకపేట ప్రధాన ద్వారం వద్ద జరిగిన ఈ కాల్పులు విశాఖ ప్రజల్లో భయాందోళనలు రేపుతున్నాయి. నాటు తుపాకీ వాడకం, దొంగ బొగ్గు వ్యాపారం, పోలీసు సిబ్బంది ప్రమేయం వంటి అంశాలు వెలుగులోకి రావడంతో నగర భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గన్ కల్చర్‌ను అరికట్టడంలో పోలీసులు విఫలమవుతున్నారా అనే సందేహాలు రేకెత్తుతున్నాయి. ఈ కేసులో పూర్తి దర్యాప్తు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
బిగ్ బ్రేకింగ్
— Telugu Feed (@Telugufeedsite) August 18, 2025
విశాఖకి పాకిన గన్ కల్చర్.. అర్ధరాత్రి కాల్పులు
వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాల్పులు కలకలం
రాజేష్ అనే యువకుడిపై కాల్పులు జరిపిన నూకరాజు అనే వ్యక్తి
గాయాలతో kgh లో చికిత్స పొందుతున్న రాజేష్ pic.twitter.com/QeARkAVj70