ఉమ్మడి విశాఖ జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో 20 ఏళ్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసిన 170 మంది హెల్త్ అసిస్టెంట్లను అకస్మాత్తుగా తొలగించారు. సమాజానికి సేవలందించిన తమను ఈ విధంగా తొలగించి రోడ్డుపై పడేయడం అన్యాయమని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ విధానం తప్పిదమా?
తాము ఎటువంటి తప్పు చేయలేదని, అకస్మాత్తుగా విధుల నుంచి తొలగించడం అన్యాయమని, హెల్త్ అసిస్టెంట్ల వాపోతున్నారు. ఎలాంటి సమాచారం లేకుండా ఈ విధంగా తొలగించడం తమ మనుగడను దెబ్బతీసింది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళన చేసే సూచనలు కనిపిస్తున్నాయి.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వాలంటీర్లను తొలగించింది. ఎన్నికల సమయంలో రూ.10 వేల వేతనం అని హామీ ఇచ్చినప్పటికీ అధికారంలోకి వచ్చిన తరువాత వాలంటీర్లకు ఉపాధి కరువైన విషయం తెలిసిందే. అదే విధంగా గత ప్రభుత్వ హయాంలో నిర్మాణమైన మెడికల్ కాలేజీలను ప్రైవేటైజేషన్ చేసే దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా 170 మంది హెల్త్ అసిస్టెంట్లు తొలగించబడ్డారు.







