---Advertisement---

విశాఖ‌లో దారుణం.. కూతురుపై క‌న్న‌తండ్రి లైంగిక దాడి

విశాఖ‌లో దారుణం.. బాలిక‌పై క‌న్న‌తండ్రి లైంగిక దాడి
---Advertisement---

మ‌ద్యం మ‌త్తు (Alcohol Intoxication)లో మృగాడిగా ప్ర‌వ‌ర్తించాడో తండ్రి . సభ్య సమాజం తలదించుకునే దారుణ ఘటన భీమిలి (Bheemili) ప్రాంతంలో చోటుచేసుకుంది. తగరపువలసలోని పాత కృష్ణ కాలేజ్ (Old Krishna College) స‌మీపంలో మద్యం మత్తులో ఉన్న తండ్రి (Father) మంగ‌ళ‌వారం రాత్రి క‌న్న కూతురు (Own daughter)పై అత్యాచారానికి (Sexual Assault) పాల్ప‌డ్డాడు. బాలిక కేకలతో (Screams) అప్రమత్తమైన స్థానికులు వెంటనే అక్కడకు చేరుకుని, అతన్ని అడ్డుకొని దేహ‌శుద్ధి చేశారు. అనంత‌రం పోలీసులకు సమాచారం అందించారు. సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు అప్ప‌న్న‌ (Appanna) ను అదుపులోకి తీసుకొని చికిత్స నిమిత్తం బాలిక‌ను విశాఖ‌ (Visakhapatnam) లోని కింగ్ జార్జ్ హాస్పిట‌ల్‌ (King George Hospital) కు త‌ర‌లించారు.

నిందితుడు షిప్పింగ్ యార్డు (Shipping Yard) ప్రాంతానికి చెందిన అప్ప‌న్న‌గా గుర్తించారు. కూతురిపై అత్యాచారానికి ఒడిగ‌ట్టిన అప్ప‌న్న‌పై పోక్సో చట్టం (POCSO Act) కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అతడిని రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. “కన్న తండ్రే ఇలా ప్రవర్తిస్తే పిల్లలకు రక్షణ ఎక్కడ?” అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నిందితుడికి కఠినమైన శిక్ష విధించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment