డెలివరీ బాయ్‌పై జరిగిన ఘటన మరవకముందే విశాఖలో మరో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. క్యాబ్ డ్రైవర్ (Cab Driver)పై విచక్షణ రహితంగా దాడి చేసిన ఘటన సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే.. డ్రైవర్ గంగాధర్ (Gangadhar) మినీ బస్సు (Mini Bus)లో శ్రీకాకుళం నుంచి గుంటూరుకు ప్రయాణికులను తీసుకెళ్తున్నాడు. మార్గం మధ్యలో మినీ బస్సు పలుమార్లు మొరాయించింది. దారి మధ్యలో చాలాసార్లు ట్రబుల్ ఇస్తూ వచ్చింది.
దీంతో బస్సు ప్రతీసారి మొరాయిస్తుండటంతో ప్రయాణికులు (Passengers) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓనర్ (Owner) ను నిలదీశారు. దీంతో ఓనర్‌కి డ్రైవర్ సపోర్టు (Support) చేయలేదంటూ మినీ బస్సు ఓనర్ డ్రైవర్‌పై దాడికి (Attack) తెగబడ్డాడు. ఓనర్ దాడిలో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో బాధితుడు విశాఖ (Visakhapatnam) లోని 4వ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇటీవల ఫుడ్ డెలివరీ బాయ్‌ని విశాఖలోని ఆక్సిజల్ అపార్మెంట్‌లోని ఓ ప్లాట్ యజమాని చితకబాదిన విషయం తెలిసిందే. ఓనర్ దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కాగా, దాడికి పాల్పడిన ఓనర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా క్యాబ్ డ్రైవర్‌పై ఓనర్ దాడి ఘటన చర్చనీయాంశంగా మారింది.