విశాఖ (Visakhapatnam) నగరంలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. కంచరపాలెం పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఒక కాలువ (Drain)లో చిన్నారి శరీర భాగాలు (Child Body Parts) లభ్యమవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. చేతులు, కాళ్లు ముక్కలుగా పడిఉండడం సంచలనంగా మారింది. తల భాగం మాత్రం కనిపించకపోవడం షాక్‌కు గురిచేస్తోంది.
ఈ ఘటన చోటుచేసుకున్న ప్రాంతాన్ని పోలీసులు మొత్తం ముమ్మరంగా పరిశీలిస్తున్నారు. కాలువ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరా ఫుటేజ్‌ను కూడా సేకరిస్తున్నారు. చిన్నారి హత్యకు గురై ఉండొచ్చనే అనుమానంతో పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల ప్రాంతంలో ఎవరైనా చిన్నారి కనిపించకపోవడం, వివిధ పోలీస్‌స్టేషన్లలో మిస్సింగ్ కేసులు నమోదయ్యాయా అనే విషయాలను కూడా చెక్ చేస్తున్నారు.
ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమాయక చిన్నారిపై ఈ విధమైన క్రూరత్వం చూపిన వారిని వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తం ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.








