ఎయిర్‌పోర్టులో మీడియాతో కోహ్లి వాగ్వాదం

ఎయిర్‌పోర్టులో మీడియాతో కోహ్లి వాగ్వాదం

ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ ఎయిర్‌పోర్టులో భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లి స్థానిక మీడియా ప్రతినిధులతో వాగ్వాదానికి దిగారు. కోహ్లి తన కుటుంబంతో కలిసి విమానాశ్రయం నుంచి హోటల్‌కి వెళ్తుండగా, అక్కడ మీడియా ప్ర‌తినిధులు త‌న‌ కుటుంబ సభ్యుల ఫొటోలు, వీడియోలు తీయడానికి ప్రయత్నించారు.

ఈ పరిస్థితి కోహ్లిని తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. “అనుమతి లేకుండా పిల్లల ఫొటోలు ఎలా తీస్తారు?” అని ప్రశ్నించిన కోహ్లి, ఓ మహిళా జర్నలిస్టుతో సీరియస్‌గా మాట్లాడారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్ర‌స్తుతం వైరల్ అవుతోంది.

ప్రైవసీకి ప్రాముఖ్యత..
విరాట్ కోహ్లి తన కుటుంబ ప్రైవసీకి ఎంతో ప్రాధాన్యత ఇస్తారన్న విషయం తెలిసిందే. మీడియా ప్ర‌తినిధుల తీరు అతనికి అసహనం కలిగించింది. ఈ సంఘటన మరోసారి సెలిబ్రెటీల వ్యక్తిగత జీవితాల ప్రాముఖ్యతపై చర్చకు దారితీసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment