టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి తన ఆటతోనే కాదు, తన ప్రవర్తనతో కూడా అభిమానుల మన్ననలు పొందుతున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా దుబాయ్‌లో జరుగుతున్న మ్యాచ్‌ల మధ్య కోహ్లి ఓ దివ్యాంగ అభిమానితో సెల్ఫీ దిగారు. కోహ్లీని కలిసిన అభిమాని భావోద్వేగానికి గురైంది.
ఈ హృదయాన్ని హత్తుకునే ఫొటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. కోహ్లి ఉదారతను చూసిన నెటిజన్లు “కోహ్లి గ్రేట్”, “రియల్ హీరో” అంటూ ప్రశంసిస్తున్నారు. ఇదిలా ఉండగా, పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి అద్భుతమైన సెంచరీ చేసి భారత్‌కు ఘనవిజయం అందించాడు.