మెన్స్ వన్డే ఇంటర్నేషన్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్ (ICC Rankings)ను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. ఐసీసీ విడుదల చేసిన లిస్ట్ ద్వారా టీమిండియా అభిమానులకు శుభవార్త అందింది. టీమిండియా దిగ్గజ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli,) మరోసారి టాప్-5లోకి ప్రవేశించాడు. విరాట్ కోహ్లీ ఒక స్థానం మెరుగుపర్చుకొని 5వ స్థానానికి చేరుకోగా, యువ బ్యాటింగ్ సంచలనం శుభ్‌మన్ గిల్(Shubman Gill) నంబర్-1 స్థానాన్ని కొనసాగిస్తున్నాడు.
అతని తర్వాత పాక్ బ్యాటర్ బాబర్ అజామ్ (Babar Azam) రెండవ స్థానంలో, భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మూడో స్థానంలో, సౌతాఫ్రికా బ్యాటర్ క్లాసెన్ (4) స్థానాల్లో ఉన్నారు. ఈ ర్యాంకింగ్స్ ద్వారా కోహ్లీ ఫామ్‌లోకి వచ్చాడని స్పష్టమవుతోంది. రాబోయే మ్యాచ్‌ల్లో మరింత మెరుగైన ప్రదర్శన కనబరిస్తే, అతను మరోసారి టాప్-3లోకి చేరే అవకాశముందని కింగ్ కోహ్లీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.