బెంగళూరు (Bengaluru)లోని చిన్నస్వామి స్టేడియం (Chinnaswamy Stadium)లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో జరుగుతున్న మ్యాచ్‌లో విరాట్ కోహ్లి (Virat Kohli) అరుదైన రికార్డులను తన ఖాతాలోకి జత చేసుకున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో ఒకే ఒక్క ఫ్రాంచైజీ అయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) తరఫున 300 సిక్సులు (Sixers) బాదిన తొలి బ్యాటర్ (First Batter)గా చరిత్రలోకి ఎక్కారు.
ఇది మాత్రమే కాకుండా, టీ20 ఫార్మాట్‌లో ఒక్కే స్టేడియంలో అత్యధిక సిక్సులు (152) బాదిన ఆటగాడిగా మరో మైలురాయి చేరుకున్నారు. ఈ ఘనతతో క్రిస్ గేల్ (151) రికార్డును విరాట్ కోహ్లీ తిరగరాయడం విశేషం. విరాట్ ఫామ్ చూస్తే, మరో కొన్ని రికార్డులు ఈ సీజన్‌లోనే కోహ్లి ఖాతాలో పడేలా కనిపిస్తోందని అంటున్నారు కింగ్ కోహ్లీ ఫ్యాన్స్.