టీమిండియా స్టార్ బ్యాటర్, ఆర్సీబీ రన్ మెషీన్ విరాట్ కోహ్లీపై ఒక యువతి చేసిన ఆరోపణలు ప్రస్తుతం నెట్టింట పెను దుమారం రేపుతున్నాయి. తానూ కోహ్లీ వల్ల గర్భవతిని అయ్యానంటూ ఆ యువతి విడుదల చేసిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఎవరీ యువతి?
కోహ్లీపై ఆరోపణలు చేస్తూ వీడియో విడుదల చేసిన యువతి గతంలో హైదరాబాద్‌లోని పాతబస్తీలో నివసించి, ప్రస్తుతం దుబాయ్‌లో ఉంటున్నట్లు సమాచారం. ఈమె గతంలో ఒక ప్రముఖ రియాలిటీ షో (బిగ్ బాస్) కి గెస్ట్‌గా వచ్చి అప్పట్లో హల్ చల్ చేసింది. తాజాగా తన వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేస్తూ.. విరాట్ కోహ్లీతో తనకు సంబంధం ఉందని, ఇప్పుడు తాను గర్భవతినని సంచలన వ్యాఖ్యలు చేసింది.
ట్రోలింగ్ అవుతానని తెలుసు..
ఈ వీడియో విడుదల చేసిన తర్వాత నెటిజన్లు తనను ఏ రేంజ్లో ఆడుకుంటారో తనకు ముందే తెలుసని, అయినప్పటికీ నిజం చెప్పడానికే తాను ముందుకు వచ్చానని ఆ వీడియోలో పేర్కొంది. అయితే, ఆమె మాటల్లో ఎక్కడా స్పష్టత లేకపోవడం, ఎటువంటి ఆధారాలు చూపకపోవడంతో నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు.
మండిపడుతున్న విరాట్ అభిమానులు
కోహ్లీకి ఉన్న క్రేజ్‌ను వాడుకుని, కేవలం పబ్లిసిటీ మరియు ఫాలోవర్స్ పెంచుకోవడం కోసమే ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తోందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యూస్ కోసం సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాన్ని రచ్చ చేయడం ఫ్యాషన్ అయిపోయిందని విమర్శిస్తున్నారు. ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న యువతిపై కఠిన చర్యలు తీసుకోవాలని బిసిసిఐ (BCCI) మరియు కోహ్లీ టీమ్‌ను ఫ్యాన్స్ కోరుతున్నారు. విరాట్ కోహ్లీ గానీ, ఆయన ప్రతినిధులు గానీ ఈ వైరల్ వీడియోపై ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.








