‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘జాక్’. ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన ‘పాబ్లో నెరుడా’ పాట యూట్యూబ్‌లో అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. క్యాచీ లిరిక్స్, అదిరే బీట్, స్టైలిష్ విజువల్స్ ఇవి పాటను ప్రేక్షకులకు మైమరపించేలా చేస్తున్నాయి. ఫ్యాన్స్ మాత్రమే కాదు, సంగీత ప్రియులు కూడా ఈ సాంగ్‌కి బాగా కనెక్ట్ అవుతున్నారు. పాబ్లో నెరుడా సాంగ్‌కు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.
ఈ సినిమా ఏప్రిల్ 10వ తేదీ నుంచి థియేటర్లలో సందడి చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే రిలీజ్ అయిన జాక్ టీజర్ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్‌ను సాధించుకుంది. ఈ సినిమా స్టార్ బాయ్ సిద్ధు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.