వినుత కేసులోకి ‘బొజ్జ‌ల’ ఎంట్రీ.. డీల్ కుద‌ర‌లేదా..?

వినుత కేసులోకి 'బొజ్జ‌ల' ఎంట్రీ.. డీల్ కుద‌ర‌లేదా..?

శ్రీ‌కాళ‌హ‌స్తి (Srikalahasti)లో జ‌న‌సేన పార్టీ (JanaSena Party) ఇన్‌చార్జ్ (In-charge) డ్రైవ‌ర్ హ‌త్య (Driver Murder) కేసు (Case) ఆంధ్రా (Andhra)‌, త‌మిళ (Tamil) రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టిస్తోంది. జ‌న‌సేన పార్టీ ఇన్‌చార్జ్ కోటా వినుత (Kota Vinutha) అధికార జ‌న‌సేన పార్టీకి కొత్త త‌ల‌నొప్పి తెచ్చిపెట్టింద‌ని ఆ పార్టీ నేత‌లు భావిస్తుండగా, ఈ కేసుకు సంబంధించిన ఆస‌క్తిక‌ర విష‌యాలు శ్రీ‌కాళ‌హ‌స్తిలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. డ్రైవ‌ర్ హ‌త్య కేసులోకి శ్రీ‌కాళ‌హ‌స్తి ఎమ్మెల్యే బొజ్జ‌ల సుధీర్‌రెడ్డి (Bojjala Sudheer Reddy) ఎంట్రీ ఇచ్చారు. ఇప్ప‌టికే ఈ కేసులో జ‌న‌సేన బ‌హిష్కృత నేత వినుత కోట‌, చంద్ర‌బాబు దంపతులకు ఎమ్మెల్యేకు మ‌ధ్య ఎన్నిక‌ల స‌మ‌యంలో కూట‌మి పెద్ద‌ల సమ‌క్షంలో జ‌రిగిన ఒప్పంద‌మే ప్ర‌ధాన కార‌ణ‌మ‌నే ఆరోప‌ణ‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

ఎన్నిక‌ల స‌మ‌యంలో శ్రీ‌కాళ‌హ‌స్తి కూట‌మి అభ్య‌ర్థిగా బొజ్జ‌ల సుధీర్‌రెడ్డిని నియ‌మించారు. అయితే సుధీర్ ఎంపిక‌కు జ‌న‌సేన పార్టీ-టీడీపీ మ‌ధ్య జ‌రిగిన ఒప్పంద‌మే కార‌ణ‌మ‌ట‌. సుధీర్‌రెడ్డికి జ‌న‌సేన స‌పోర్ట్ చేసి గెలిపిస్తే, గెలిచిన త‌రువాత ఏడాదికి రూ.15 కోట్లు వినుత కోట్ల దంప‌తుల‌కు ఇవ్వాల‌ని పెద్ద‌ల స‌మ‌క్షంలోనే డీల్ కుదిరింద‌ట‌. ఒప్పందం ప్ర‌కారం వినుత దంప‌తులు కూట‌మి అభ్య‌ర్థికి స‌పోర్ట్ చేసి గెలిపించారు. గెలిచి 13 దాటినా.. ముందు కుదుర్చుకున్న డీల్ ప్ర‌కారం త‌మ‌కు ఇవ్వాల్సిన రూ.15 కోట్లు ఇంకా సుధీర్‌రెడ్డి ముట్ట‌జెప్ప‌క‌పోవ‌డంతో ఆగ్ర‌హించిన వినుత దంప‌తులు ఈ వ్య‌వ‌హారంపై ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఫిర్యాదు చేశార‌ట‌. డ‌బ్బులు అడిగితే ఇబ్బందిపెడుతున్నాడ‌ని ప‌వ‌న్ ఎదుట వాపోయార‌ట‌.

ఇక లాభం లేద‌ని శ్రీ‌కాళ‌హ‌స్తిలో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి చేస్తున్న దందాల‌పై వినుత దంప‌తులు ఫోక‌స్ పెంచార‌ట‌. అధికారాన్ని అడ్డం పెట్టుకొని 13 నెల‌ల కాలంలోనే రూ.200 కోట్లు కొల్ల‌గొట్టాడ‌ని, అందుకు సంబంధించిన కొన్ని ఆధారాల‌ను సేక‌రించి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు మ‌రోసారి ఫిర్యాదు చేశార‌ట వినుత దంప‌తులు. ఈ వ్య‌వ‌హారం కాస్త ఎమ్మెల్యేకు తెలియ‌డంతో ఎలాగైనా వినుత దంప‌తుల నోరు మూయించాల‌ని ఓ కుట్ర ప‌థ‌కాన్ని రచించాడ‌ని శ్రీ‌కాళ‌హ‌స్తిలో చ‌ర్చ జ‌రుగుతోంది.

వినుత డ్రైవ‌ర్ శ్రీ‌నివాస్ (Srinivas) అలియాస్ రాయుడు (Rayudu)తో స‌న్నిహితంగా మెలుగుతోంద‌ని సుధీర్‌రెడ్డి తెలుసుకున్నాడ‌ట‌. డ్రైవ‌ర్ రాయుడును పిలిపించుకొని బెదిరించి, భ‌య‌పెట్టాడ‌ట‌. వినుత‌తో క్లోజ్‌గా ఉన్న వీడియోల‌ను త‌న‌కు ఎప్ప‌టిక‌ప్పుడు చేర‌వేస్తే రూ.50 ల‌క్ష‌లు ఇస్తాన‌ని డ్రైవ‌ర్ రాయుడుతో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి డీల్ కుదుర్చుకున్నాడ‌ని శ్రీ‌కాళ‌హ‌స్తిలో చ‌ర్చించుకుంటున్నారు. ఒప్పందం ప్ర‌కారం వినుత బెడ్‌రూమ్‌లో డ్రైవ‌ర్ రాయుడు కొన్ని హిడెన్ కెమెరాలను అమ‌ర్చాడ‌ని, వాటిలో రికార్డ్ అయిన‌ వీడియోల‌ను సుధీర్‌రెడ్డికి చేర‌వేర్చాడ‌ట‌.

రాయుడు త‌న స్నేహితుల‌తో ఉన్న స‌మ‌యంలో ఈ విష‌యాన్ని లీక్ చేయ‌డంతో ఆ నోటా, ఈ నోటా ఈ విష‌యం వినుత భ‌ర్త వ‌ద్ద‌కు చేరింద‌ట‌. దీంతో వినుత కూడా భ‌ర్త‌కు జ‌రిగిన విష‌యాన్ని చెప్ప‌డంతో ఈ విష‌యాన్ని ఇలాగే నాన్చితే ఇబ్బంద‌ని డ్రైవ‌ర్‌ను అంత‌మొందించేందుకు ప‌థ‌క‌మేశార‌ట‌. ప్లాన్ ప్ర‌కారం త‌మ గోడౌన్‌లోకి రాయుడును పిలిపించి చిత్ర‌హింస‌ల‌కు గురిచేసి హ‌త్య చేసి ఎవ‌రికీ అనుమానం రాకూడ‌ద‌ని చెన్నైలో ప‌డేశార‌ని స్థానికంగా చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే అరెస్ట్ సంద‌ర్భంలో వినుత దంప‌తులు కూడా ఈ మొత్తం వ్య‌వ‌హారం వెనుక టీడీపీ ఎమ్మెల్యే బొజ్జ‌ల సుధీర్‌రెడ్డి ఉన్నాడ‌ని ఆరోపించ‌డం కూడా సంచ‌ల‌నంగా మారింది.

శ్రీ‌కాళ‌హ‌స్తిలో ఇంత‌టి దారుణం చోటుచేసుకున్నా కొన్ని మీడియా ఛానెళ్లు ఈ వ్య‌వ‌హారాన్ని క‌ప్పిపుచ్చే ప్ర‌య‌త్నం చేయ‌డం గ‌మ‌నార్హం. వినుత డ్రైవర్ శ్రీనివాస్ హత్యగావించబడ్డాడన్నది వాస్తవం, వినుత, ఆమె భర్త చంద్రబాబుతో పాటు మరో ముగ్గురిని చెన్నై పోలీసులు అరెస్టు చేశారన్నది వాస్తవం. ఈ హత్యకు, వారి అరెస్టుకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి ఉన్నార‌ని వినుత‌నే మీడియాకు చెప్పింది. ఇంత జ‌రుగుతున్నా టీడీపీ అను కుల మీడియా కానీ, కూట‌మి నేత‌లు కానీ ఈ ఇష్యూపై నోరు మెద‌ప‌క‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. మొన్న‌టి వ‌ర‌కు డ్రైవ‌ర్‌ను హ‌త్య చేసి డోర్ డెలివ‌రీ చేశార‌ని వైసీపీ విమ‌ర్శించిన ఇదే మీడియా ఇప్పుడు రాయుడు హ‌త్య‌తో వాళ్ల నోట్లో ప‌చ్చి వెల‌క్కాయ‌ప‌డ్డ‌ట్లు అయింది.

Join WhatsApp

Join Now

Leave a Comment