భారత (India) స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ (Vinesh Phogat)పై వస్తున్న విమర్శలపై ఆమె ఘాటుగా స్పందించారు. ప్రభుత్వం ప్రకటించిన నగదు బహుమతి (Cash Reward)పై కొందరు సోషల్ మీడియాలో చేస్తున్న విమర్శలపై అసహనం వ్యక్తం చేసిన ఆమె, “నోరు మూసుకుని మూలన కూర్చొని ఏడవండి (Shut Up And Cry In a Corner)” అంటూ ఎక్స్(X)లో స్ట్రాంగ్ కౌంటర్ (Strong Counter) ఇచ్చారు.
“కోట్ల రూపాయలు ఇస్తామన్నా, శీతల పానీయాలు గానీ, గేమింగ్ ప్రకటనలకీ నేను ఇంట్రెస్ట్ పెట్టలేదు. నేను సాధించిన ప్రతిదీ నిజాయితీగా, కష్టం చేసి సంపాదించాను. దయచేసి ఆ కష్టాన్ని అర్థం చేసుకోండి” అంటూ తనపై విమర్శలు చేస్తున్న వారికి ఫొగాట్ కౌంటర్ ఇచ్చారు.
ఒలింపిక్స్ (Olympics) లో తక్కువ బరువుతో ఫైనల్లో అనర్హతకు గురై, పతకం తగలకపోయినా, ఆమె ప్రదర్శనను ప్రభుత్వం రజత పతకం (Silver Medal) స్థాయిలో గుర్తించి రూ. 4 కోట్లు ప్రకటించింది. దీనిపైనా విమర్శలు రావడంతో వినేశ్ ఫొగాట్ చేసిన ముక్కుసూటి కామెంట్ వైరల్‌గా మారింది.