2028 ఒలింపిక్స్ కోసం మళ్లీ బరిలోకి వినేష్ ఫోగట్

2028 ఒలింపిక్స్ కోసం మళ్లీ బరిలోకి వినేష్ ఫోగట్

భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ (Vinesh Phogat) సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో ప్రకటించిన రిటైర్మెంట్‌ను (Retirement) వెనక్కి తీసుకుంటున్నట్లు ఆమె శుక్రవారం ఎక్స్‌ ప్లాట్‌ఫామ్‌లో వెల్లడించింది. 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్లో (2028 Los Angeles Olympics) పతకం సాధించాలనే లక్ష్యంతో మళ్లీ బరిలోకి దిగబోతున్నట్లు ప్రకటించింది. పారిస్ ఒలింపిక్స్‌ (Paris Olympics)లో ఫైనల్‌ పోరుకు చేరినా, టెక్నికల్ కారణాల వల్ల అనర్హురాలిగా ప్రకటించడంతో పాటు రన్నరప్ పతకం కూడా ఇవ్వకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన ఆమె అప్పట్లో రెజ్లింగ్‌కు గుడ్‌బై చెప్పింది.

రిటైర్మెంట్ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వినేష్, హర్యానా నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందింది. జూలైలో ఒక మగబిడ్డకు జన్మనిచ్చిన ఆమె, సుమారు 18 నెలల తర్వాత తిరిగి తన రెజ్లింగ్ కెరీర్‌పై దృష్టి పెట్టాలని నిర్ణయించుకుంది. ఈ పునరాగమనంపై ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ పోస్టు చేస్తూ, 2028 ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment