మంత్రి లోకేష్ ఇంటి ముట్టడికి SFI యత్నం.. తీవ్ర ఉద్రిక్త‌త‌ (Video)

మంత్రి లోకేష్ ఇంటి ముట్టడికి SFI యత్నం.. తీవ్ర ఉద్రిక్త‌త‌ (Video)

విజయవాడ (Vijayawada) ధర్నా చౌక్ (Dharna Chowk) ర‌ణ‌రంగంగా మారింది. విద్యార్థుల స‌మ‌స్య‌లు, విద్యా సంస్థ‌ల‌పై కూట‌మి ప్ర‌భుత్వ ష‌ర‌తుల‌ను నిర‌సిస్తూ ఎస్ఎఫ్ఐ(SFI) పెద్ద ఎత్తున ఆందోళ‌న చేప‌ట్టింది. విద్యార్థి సంఘం SFI పిలుపు మేరకు “చలో విజయవాడ” (Chalo Vijayawada) కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు చేరుకున్నారు. విజ‌య‌వాడ ధ‌ర్నా చౌక్ వ‌ద్ద శ‌నివారం ఉద్రిక్త వాతావరణానికి వేదికైంది.

ప్రభుత్వం ఇటీవల పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో విద్యార్థి సంఘాలకు అనుమతి లేదని ఉత్తర్వులు జారీ చేయగా, దీనికి వ్యతిరేకంగా విద్యార్థులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా పెండింగ్‌లో ఉన్న రూ.6,400 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ (Fees Reimbursement) విడుదల చేయాలి, హాస్టల్ మెస్ ఛార్జీలను రూ.3000కు పెంచాలి, హాస్టల్ అభివృద్ధికి నిధులు కేటాయించాలి, ఎటువంటి షరతులు లేకుండా అర్హులైన తల్లులకు ‘తల్లికి వందనం’ (Thalliki Vandanam) పథకం అమలు చేయాలి అని విద్యార్థి సంఘ నేతలు డిమాండ్ చేశారు.

ఆందోళన తీవ్రరూపం దాల్చగా, విద్యార్థి సంఘ నేతలు మంత్రి నారా లోకేష్ ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని నేతలను ఈడ్చిపడేశారు. ఈ సందర్భంగా పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని మహిళా విద్యార్థులు ఆరోపించారు. “సమస్యలు పరిష్కరించమని అడుగుతుంటే అరెస్టులు చేయడం న్యాయమా? ఇదేనా ఫ్రెండ్లీ పోలీస్?” అంటూ ప్ర‌భుత్వాన్ని, పోలీసుల‌ను నిలదీశారు. ఏడీసీపీ (ADCP) రామకృష్ణ (Ramakrishna) నేతృత్వంలో విద్యార్థులపై దాడులు జరగడం విద్యార్థి సంఘాల ఆగ్రహానికి కారణమైంది. రణరంగంగా మారిన ధర్నా చౌక్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment