విజయవాడ (Vijayawada)లోని ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (AP Tourism Development Corporation) డివిజనల్ కార్యాలయంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఓ ఉద్యోగి రహస్య ప్రేమాయణం (Secret Affair) వెలుగులోకి వచ్చింది. ఆయన తన బైక్‌పై ప్రతిరోజూ రాత్రివేళ ఓ మహిళను వెంటబెట్టుకుని ఆఫీసుకు వస్తుండడం అధికారుల దృష్టికి వచ్చింది.
రాత్రిళ్లు ఆఫీసుకు..
ఆయన పర్యాటకాభివృద్ధి సంస్థలో (Tourism Development Corporation) ఉద్యోగి కావడంతో సెక్యూరిటీ సిబ్బంది కూడా మొదట్లో ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. కానీ ప్రతి రాత్రి ఒకే సమయంలో మహిళను తీసుకుని వచ్చి, బైక్ పార్క్ చేసిన అనంతరం ఆమెను ఆఫీసులోకి తీసుకెళ్లి సుమారు అర్ధగంట పాటు ఉండి వెళ్లిపోతుండటంతో, సెక్యూరిటీ సిబ్బందికి అనుమానాలు తలెత్తాయి.
సీసీ కెమెరా ఫుటేజ్‌తో బాగోతం బహిర్గతం
ఈ అంశాన్ని అధికారులు సీరియస్‌గా తీసుకుని, సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలించారు. దాంతో ఆ ఉద్యోగి అసలు రాసలీల వ్యవహారం (illicit relationship) బయటపడింది. ఆఫీసు ప్రాంగణంలోనే మహిళతో గడిపిన తీరు అధికారులకు ఆశ్చర్యం కలిగించింది. ఇంతకీ, వ్యవహారం ఇంతటితో ముగియలేదు. ఆ మహిళతో ఉన్న సన్నిహిత ఫోటోను ఆయన తన వాట్సాప్ స్టేటస్‌లో (WhatsApp status) పెట్టడం ద్వారా తనే తన రహస్యాన్ని బహిర్గతం చేసుకున్నట్టయ్యింది. దీంతో విషయం మరింత చర్చకు దారి తీసింది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు (Higher officials) విచారణకు ఆదేశించగా, ఉద్యోగిపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఏపీటిడీసీ (APTDC)లో ఈ తరహా వ్యవహారం చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.