Vijay-Trisha: పెళ్లి వేడుకలో విజయ్–త్రిష కలిసి సందడి… వైరల్ అవుతున్న వీడియోలు!

చెన్నైలో (Chennai) జరిగిన ఓ ప్రముఖ వివాహ వేడుకలో (Wedding Ceremony) హీరో విజయ్ (Vijay), నటి త్రిష (Trisha) కలిసి హాజరుకావడం ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల విజయ్ భార్య సంగీత (Sangeetha) చేసిన ఆరోపణల తర్వాత వీరిద్దరూ ఒకే కారులో వచ్చి పెళ్లి రిసెప్షన్‌లో పాల్గొనడం అందరి దృష్టిని ఆకర్షించింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వేగంగా వైరల్ అవుతున్నాయి.


నిర్మాత కల్పతి ఎస్. సురేష్ (Kalpathi S. Suresh) కుమారుడి వివాహ కార్యక్రమానికి విజయ్–త్రిష కలిసి హాజరయ్యారు. ఈ వేడుకకు తమిళ సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు వచ్చినప్పటికీ, అందరి చూపు మాత్రం విజయ్–త్రిష జంటపైనే నిలిచింది. ప్రస్తుతం ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది.
విజయ్, త్రిష గతంలో ఘిల్లి, తిరుపాచి, లియో వంటి చిత్రాల్లో కలిసి నటించారు. అప్పటి నుంచే వీరిద్దరి స్నేహంపై (Friendship) ఊహాగానాలు (Rumours) వినిపించేవి. ఇప్పుడు ఇద్దరూ కలిసి పెళ్లి వేడుకలో కనిపించడంతో ఆ చర్చలు మరింత పెరిగాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment