చైనాలో ‘మహారాజ’ మేనియా.. సెంటిమెంట్‌కు కంట‌త‌డి

చైనాలో ‘మహారాజ’ మేనియా.. సెంటిమెంట్‌కు కంట‌త‌డి

ఇండియాలో సూపర్ హిట్టుగా నిలిచిన ‘మహారాజ’ మూవీ ఇప్పుడు చైనాలోనూ అద్భుతమైన విజయాన్ని సాధిస్తోంది. తండ్రీకూతుళ్ల బంధాన్ని సున్నితంగా మలిచిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి, సచినా నమిదాస్, అనురాగ్ కశ్యప్ వంటి నటుల అద్భుత నటనతో ప్రేక్షకులను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నారు.

చైనాలో ప్రేక్షకుల స్పందన
చైనాలో ఈ చిత్రానికి భారీ ఆదరణ లభిస్తోంది. థియేటర్లలో కొన్ని కీలక సన్నివేశాల సమయంలో ప్రేక్షకులు కంటతడి పెట్టుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారతీయ సాంస్కృతిక భావాలను అంతర్జాతీయ స్థాయిలో చైనీస్ ప్రేక్షకులు ఎంతో ప్రేమగా స్వీకరిస్తున్నారు.

100 కోట్ల మార్క్ దాటిన వసూళ్లు
ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణతో ‘మహారాజ’ చైనాలో ఇప్పటికే రూ.100 కోట్ల వసూళ్లను దాటింది. ఇది భారతీయ చిత్ర పరిశ్రమకు మరో గర్వకారణం. సాధారణంగా చైనీస్ ప్రేక్షకులకు ఇష్టమైన యాక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ వంటి అంశాలపై కాకుండా, ఈ చిత్రం ఎమోషనల్ కాన్సెప్ట్‌తో విశేషంగా ప్రభావం చూపుతోంది.

అంతర్జాతీయ స్థాయిలో..
‘మహారాజ’ విజయంతో భారతీయ సినిమా కథలు ప్రపంచ స్థాయిలో చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఈ సినిమా తెలుగులో ప్రేక్షకులను ఆకట్టుకున్నట్టే, చైనాలో కూడా తన ప్రాభవాన్ని చూపడం విశేషం.

Join WhatsApp

Join Now

Leave a Comment