తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ గతేడాది తమిళగ వెట్రి కళగం పేరుతో రాజకీయ పార్టీని స్థాపించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి రెడీ అవుతున్న విజయ్.. పార్టీ పరంగా తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. తన అభిమాన సంఘాల్లో గడపగడపకు శ్రమిస్తున్న సాదాసీదా కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందులో భాగంగా దక్షిణ చెన్నై ఉత్తర జిల్లా కార్యదర్శిగా Tనగర్‌కు చెందిన అప్పును నియమించారు.
ఆటో డ్రైవర్‌గా జీవనాన్ని సాగిస్తున్న అప్పు ఇప్పుడు జిల్లా స్థాయిలో కీలక రాజకీయ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నియామకం ద్వారా విజయ్ పార్టీ సాధారణ ప్రజలకు రాజకీయ అవకాశాలు అందుబాటులోకి తెస్తోంది. ఇక పార్టీ కార్యకలాపాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు విజయ్ నేతృత్వంలో జరుగుతున్నాయి.