ఎన్డీఏ కూటమిలోకి విజయ్!? కీరోల్ దిశగా చర్చలు!

ఎన్డీఏ కూటమిలోకి విజయ్!? కీరోల్ దిశగా చర్చలు!

తమిళనాడు (Tamil Nadu) లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) జరగనున్న నేపథ్యంలో, అధికార పక్షం-DMK, ప్రతిపక్షం-AIADMK సహా అన్ని కీలక పార్టీలు ఇప్పటికే వ్యూహాల రూపకల్పనలో మునిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే ప్రముఖ నటుడు విజయ్ (Vijay) స్థాపించిన టీవీకే (TVK – తమిళగ వెట్రి కళంగం) పార్టీ ఈ ఎన్నికల్లో తొలిసారిగా బరిలోకి దిగనుంది.

ఎన్డీఏలోకి విజయ్ పార్టీ?
ఇటీవల విజయ్ పార్టీ దిశగా కీలక మార్పులు జరుగుతున్నట్టు సంకేతాలు వెలుగులోకి వచ్చాయి. టీవీకే పార్టీ, భారతీయ జనతా పార్టీ (BJP) నేతృత్వంలోని ఎన్డీఏ (NDA) కూటమిలోకి చేరేందుకు చర్చలు జరుగుతున్నట్లు ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే దీనిపై తుది నిర్ణయం డిసెంబర్‌లో తీసుకునే అవకాశం ఉన్నట్లు టీవీకే వర్గాలు చెబుతున్నాయి.

రాష్ట్రయాత్ర తర్వాత క్లారిటీ?
విజయ్ త్వరలో తమిళనాడు వ్యాప్తంగా రాష్ట్రయాత్ర చేపట్టనున్నారు. ఈ యాత్ర పూర్తయ్యాకే తమ రాజకీయ భవితవ్యంపై స్పష్టత ఇస్తామని టీవీకే నేతలు అంటున్నారు. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలన్న దానిపై ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటామని వారు చెప్పారు. విజయ్ ఎన్డీఏ కూటమిలో చేరితే, ఆయ‌న‌కే నాయకత్వ బాధ్యతలు అప్పగించనున్నట్లు టీవీకే పార్టీ కార్యదర్శి ఆదవ్ అర్జున్ (Adhav Arjun) ప్రకటించారు. ఇప్పటికే బీజేపీ – ఏఐడీఎంకే మధ్య పొత్తు కొనసాగుతున్నా, విజయ్ చేరితే కీరోల్ ఆయనకే దక్కుతుందని ప్రచారం సాగుతోంది. తమిళనాడులో బీజేపీ విజయ్‌ను ముందుంచి ప్రజల్లోకి వెళ్లాలనుకుంటున్నట్లు సమాచారం.

ఏపీ ఫార్ములా తమిళనాడులో పనిచేస్తుందా?
ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లో ఎన్డీఏ కూటమి (NDA Alliance) గా (తెలుగుదేశం, జనసేన, బీజేపీ) బరిలోకి దిగినట్లుగానే, తమిళనాడులో కూడా ఓ సంయుక్త ఫార్ములా (Joint Formula) ప్రయత్నం జరుగుతోందా? అన్నదానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. ఈ పొత్తులు ఫలిస్తాయా లేదా అన్నదానిపై స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Join WhatsApp

Join Now

Leave a Comment