‘జన నాయగన్’లో కీలక పాత్రలో శృతి

‘జన నాయగన్’లో కీలక పాత్రలో శృతి

తమిళ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజయ్ (Thalapathy Vijay) కెరీర్‌లో చివరి సినిమాగా తెరకెక్కుతున్న ‘జన నాయగన్’ (Jana Nayagan)లో క్రేజీ హీరోయిన్ శృతిహాసన్(Shruti Haasan) కూడా జాయిన్ కానున్నారు. హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఇప్పటికే పూజా హెగ్డే(Pooja Hegde) హీరోయిన్‌గా ఫిక్స్ కాగా, మేకర్స్ మరో హీరోయిన్‌గా శృతిని ఎంపిక చేసినట్లు సమాచారం.

త్వరలోనే ఆమె షూటింగ్‌లో పాల్గొననుండగా, ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మమితా బైజు, బాబీ డియోల్, ప్రియమణి వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2026 సంక్రాంతికి ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను రూ.300 కోట్ల భారీ బ‌డ్జెడ్‌తో తెర‌కెక్కించ‌నున్న‌ట్లు స‌మాచారం.

Join WhatsApp

Join Now

Leave a Comment