టీవీకే అధినేత (TVK Leader), ప్రముఖ నటుడు విజయ్ (Vijay) తమిళనాడులో (Tamil Nadu) ఎన్నికల (Elections) శంఖారావం పూరించారు. గురువారం ఆయన ఈరోడ్ జిల్లాలో భారీ ర్యాలీ (Mass Rally) నిర్వహించారు. ఈ సందర్భంగా అధికార డీఎంకే పార్టీ (DMK Party)పై తీవ్ర విమర్శలు చేశారు. డీఎంకే దుష్ట శక్తిగా ఉందని, టీవీకే మాత్రం ప్యూర్ శక్తిగా ఉందని ఆయన పేర్కొన్నారు. 2026 నాటికి టీవీకే క్లీన్ అండ్ ప్యూర్ ఫోర్స్‌గా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పాలనలోని వైఫల్యాలు, నీటిపారుదల సమస్యలు, ఉద్యోగాల కొరత, భద్రతా సమస్యలు మరియు రైతు సంక్షేమంలో డీఎంకే విఫలమైందని ఆయన అన్నారు.
విజయ్ ఈరోడ్ ప్రాంతాన్ని పసుపు పండించే పవిత్ర భూమిగా అభివర్ణించి, ప్రజల విశ్వాసం తనకు బలాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. తాను సినీ రంగంలో 34 సంవత్సరాలు పనిచేసినట్లు, ప్రజలతో సంబంధం కొత్తదని, కొన్ని కుట్రల ద్వారా టీవీకేను నాశనం చేయాలనేవారు ఉన్నారని హితపూర్వకంగా చెప్పారు. ఎన్నికల్లో ప్రజలతో నేరుగా సన్నిహిత సంబంధం అవసరం అని స్పష్టం చేశారు.
సామాజిక సంస్కర్త పెరియార్ (Periyar) వ్యక్తిత్వాన్ని కూడా విజయ్ కొనియాడారు. ‘ఈరోడ్ ఉక్కు మనిషి’గా, తమిళనాడును మార్చిన వ్యక్తిగా ఆయన ప్రస్తావించారు. పెరియార్ ఇచ్చిన సైద్ధాంతిక పునాది, అన్నా (Anna), ఎంజీఆర్ (MGR) ఎన్నికల వ్యూహాలు టీవీకేకు మార్గదర్శకమని గుర్తుచేశారు. పెరియార్ పేరును దోపిడి కోసం ఉపయోగించకూడదని, అలా చేస్తే రాజకీయ శత్రువుగా భావిస్తామని అన్నారు. 2026లో ఎన్నికల ఫలితాలు భిన్నంగా ఉండే అవకాశం ఉందని తెలిపారు.








