‘వీడీ12’ హిందీ వెర్షన్ టీజర్‌కు రణబీర్ వాయిస్!

vijay-deverakonda-vd12-ranbir-kapoor-voice-over

విజయ్ దేవరకొండ హీరోగా, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘వీడీ12’ పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో రూపొందుతోంది. ఈ చిత్రంలో భాగ్య శ్రీ బోర్సే ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా హిందీ వెర్షన్ టీజర్‌కు బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ వాయిస్ ఓవర్ అందించనుండటం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.

ఈవిషయాన్ని తెలుపుతూ చిత్ర‌యూనిట్ ఓ పోస్టర్‌ను విడుద‌ల చేసింది. ‘యానిమల్‌’ హీరో వాయిస్‌తో విజ‌య్ మూవీ మరింత వైల్డ్‌గా మారనుందని.. ఆడియ‌న్స్‌కు కావాల్సిన ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంటుందని పేర్కొంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్లుగా తెలుస్తోంది. మార్చి 28న ఈ సినిమా విడుదల కానుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై రానున్న ఈ సినిమాకి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment