విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘VD12’ సినిమాకు సంబంధించి ఆసక్తికర అప్‌డేట్ బయటకు వచ్చింది. నిర్మాత నాగవంశీ ట్వీట్ ద్వారా సినిమాకు టైటిల్ లాక్ అయిందని వెల్లడించడంతో, టైటిల్‌పై ఊహాగానాలు మొదలయ్యాయి.
సినీవర్గాల సమాచారం మేరకు, ఈ చిత్రానికి ‘సామ్రాజ్యం’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి, ఈ వార్తల్లో నిజమెంత? అనే ప్రశ్నలు తలెత్తుతుండగా, త్వరలోనే టైటిల్‌పై అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నాడు. విజయ్ దేవరకొండ మరొక పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించనున్నాడని అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి!