దేవరకొండ కోసం ‘దేవర’.. సర్‌ప్రైజ్ గిఫ్ట్

దేవరకొండ కోసం ‘దేవర’.. సర్‌ప్రైజ్ గిఫ్ట్

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో, ది రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ప్రధాన పాత్రలో న‌టిస్తున్న ‘VD12′ సినిమా టీజర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రేపు విడుదలకానున్న ఈ టీజర్‌కు స్టార్ హీరోలు వాయిస్ ఓవర్ అందించడం విశేషం.

స్టార్ హీరోల వాయిస్ ఓవర్ – ప్రత్యేక ఆకర్షణ
ఈ సినిమా టీజర్‌కి భిన్న భాషల్లో ప్రముఖ నటుల వాయిస్ ఓవర్ ఇవ్వడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. తమిళ వెర్షన్‌కు సూర్య(Suriya), హిందీ వెర్షన్‌కు రణబీర్ కపూర్ (Ranbir Kapoor) వాయిస్ అందించినట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక తెలుగులో, ఎవరు ఊహించని విధంగా ఎన్టీఆర్ (Jr.NTR) వాయిస్ ఓవర్ అందించనున్నారు!

ఇందుకు సంబంధించి ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ కలిసి ఉన్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వార్తతో అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. టీజర్ ఎలా ఉంటుందో చూడాలనే ఆసక్తి తారాస్థాయికి చేరుకుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment