విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘కింగ్‌డమ్’ సినిమాపై నిర్మాత నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజా ఇంటర్వ్యూలో నాగవంశీ, ‘కింగ్‌డమ్’ రెండు పార్టులుగా తెరకెక్కుతోందని, రెండో భాగానికి ‘కింగ్‌డమ్ స్క్వేర్’ లేదా ‘కింగ్‌డమ్ 2’ అనే టైటిల్స్‌ను పరిశీలిస్తున్నామని తెలిపారు. ఫస్ట్ పార్ట్ విజయంపై ఆధారపడి సీక్వెల్ టైటిల్‌ను ఖరారు చేస్తామని పేర్కొన్నారు.
అంతేకాదు, ఇప్పటికే సినిమా చూశానని, ఇది విమర్శకులకు కూడా అవకాశం ఇవ్వని విధంగా ఉంటుందని నిర్మాత ధీమా వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలతో సినిమాపై మరింత హైప్ పెరిగింది. ‘జెర్సీ’ సినిమా ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘కింగ్‌డమ్’ తెరకెక్కుతోంది.








